విలన్ గా నటించబోతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్

- September 16, 2017 , by Maagulf
విలన్ గా నటించబోతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్

నాటి హీరోలే.. నేటి విలన్లు అన్నట్టుగా మారిపోయింది సినీ ఇండస్ట్రీ. హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, శ్రీకాంత్ అలా మారినవారే. కానీ శ్రీకాంత్ కాస్త డిఫరెంట్. విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారి మళ్లీ విలన్ అవతారమెత్తారు. ప్రస్తుతం వీరి బాటలోనే ప్రభుదేవా కూడా నడుస్తున్నారని టాక్. ప్రభు స్టైల్ కూడా వేరే. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా.. ఆ తరువాత డైరెక్టర్‌గా కూడా మారారు.
ప్రస్తుతం ప్రతి కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రభు గులేబకావళి, యంగ్ మంగ్ జంగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న మెర్కురీ మూవీలో విలన్‌గా నటిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com