అందరికీ అందుబాటులో విమానం

- October 30, 2015 , by Maagulf
అందరికీ అందుబాటులో విమానం

 కొత్త విమానయాన పాలసీ ముసాయిదా అందరికీ విమానాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యం ముసాయిదా విధానాన్ని ప్రకటించిన అశోక్ గజపతి రాజు న్యూఢిల్లీ కేంద్రప్రభుత్వం రూపొందించిన కొత్త పౌర విమానయాన విధానం ముసాయిదా వచ్చేసింది. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు, అందుబాటు ధరల్లో విమాన సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ సరికొత్త పాలసీని కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సహాయమంత్రి మహేష్ శర్మ, ఇతర ఏవియేషన్ అధికారులు పాల్గొన్నారు. చాలా చర్చోపచర్చల తర్వాత ఈ ముసాయిదాను రూపొందించామని అశోక్ గజపతిరాజు తెలిపారు. దీంట్లో భాగంగానే అన్ని స్వదేశీ, విదేశీ టికెట్లపై 2 శాతం సెస్ విధించేందుకు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. విమాన టికెట్ గంటకు రూ. 2500 మించకుండా చూడాలనేదే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఇందు కోసం విమానయాన సంస్థలకు, విమానాశ్రయాల నిర్వాహకులకు కూడా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో 50 శాతానికి పైగా ఎఫ్‌డిఐలకు అనుమతినిచ్చేందుకు ముసాయిదా ప్రతిపాదించింది. దీనిపై ఇంకా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయవచ్చని చెప్పారు. సూచనల ఆధారంగా పాలసీలో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉందన్నారు. దీర్ఘకాలికంగా విమానయాన రంగానికి ఊతమిచ్చేలా కొ్త్త విమానయాన పాలసీని రూపొందించామని మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఈ విధానం టూరిజం, ఆతిథ్య, సేవల రంగాలకు సైతం ఊతం ఇవ్వనుందన్నారు. విమానాశ్రయాల నవీనీకరణ, రక్షణ, రవాణ తదిర అంశాలపై ప్రధానంగా దృషి పెట్టనున్నట్టు తెలిపారు. ఈ పాలసీ పరిమిత కాలానికే ఉంటుందని, దీనికనుగుణంగా ముందుగానే విధానాన్ని రూపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువమందిని విమానయాన రంగంవైపు మళ్లించటమే తమ ఉద్దేశమని సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ నయ్ చౌబే తెలిపారు. ఇక ఓపెన్ స్కై విధానానికి మూడు రకాల మార్పులను ఈ విధానం ప్రతిపాదించింది. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. మొదటిది.. ప్రస్తుతం ఉన్నట్లే 20 విమానాలతో ఐదేళ్ల పాటు స్వదేశీ విమానాలు నడిపిన అనుభవం ఉన్నవాళ్లకే అంతర్జాతీయ సర్వీసులు నడిపే అవకాశం ఇవ్వడం. రెండోది.. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం. మూడోది.. స్వదేశీ ఆపరేషన్లలో కొంత కనీస క్రెడిట్ సంపాదించుకున్న ఆపరేటర్లకు అంతర్జాతీయ సర్వీసులు నడిపే అవకాశం కల్పించడం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com