సల్మాన్ కు 'గ్లోబల్ డైవర్సిటీ అవార్డు - 2017'
- September 16, 2017
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్ పార్లమెంట్లో ఆయనకు 'గ్లోబల్ డైవర్సిటీ అవార్డు - 2017'ను అందజేశారు. ఓ నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, బుల్లితెర వ్యాఖ్యాతగా చిత్ర పరిశ్రమకు సల్మాన్ చేసిన సేవలకుగానూ ఈ అవార్డును ప్రదానం చేసారు.
'సల్మాన్ ఖాన్ అందరికీ ఆదర్శం. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రజల అభిమాన హీరో. సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన పరోపకారి. 'బీయింగ్ హ్యూమన్' అనే ఎన్జీవో ద్వారా నిరుపేదలకు సాయం చేశారు. ఆయనకు అవార్డు ప్రదానం చేయడం గౌరవంగా భావిస్తున్న ' అంటూ పార్లమెంట్ ఎంపీ కీత్వాజ్ ప్రశంసలు కురిపించారు. అవార్డు తీసుకున్న అనంతరం సల్మాన్ మాట్లాడుతూ..'నన్ను ఎంతగానో గౌరవించే, అభిమానించే అభిమానులకు ధన్యవాదాలు. నేను చాలా సినిమాలకు అవార్డులు తీసుకున్నా. కానీ వ్యక్తిగతంగా తీసుకున్న తొలి అవార్డు ఇది. చాలా సంతోషంగా ఉంది.' అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







