భారత ఫారిన్ నిల్వల సరికొత్త రికార్డు

- September 16, 2017 , by Maagulf
భారత ఫారిన్ నిల్వల సరికొత్త రికార్డు

సెప్టెంబరు 8తో ముగిసిన వారానికి మన విదేశీ మారక నిల్వలు తొలిసారి 400 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబరు 8 నాటికి మొత్తం విదేశీ మారక నిల్వలు 400.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2014లో 300 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఈ స్థాయి కేవలం మూడున్నర ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు ఏడాది పాటు చేసుకునే దిగుమతుల చెల్లింపులకు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విదేశీ మారక నిల్వలు 6.6 బిలియన్ డాలర్ల మేర పెరగిఆయి. సెప్టెంబరు 2016లో ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవి చేపట్టినప్పుడు నిల్వలు 30 బిలియన్ డాలర్ల మేర పుంజుకున్నాయి.

ఆర్బీఐ సమాచారం మేరకు విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారం, ఐఎంఎఫ్ వద్ద డ్రాయింగ్ రైట్స్ అన్ని కలిపి 400.7 బలియన్ డాలర్లు. ఇందులో ఎక్కువ శాతం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా వచ్చిన నిల్వలే. ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే అంతకు ముందు ఏడాది ఆయా నెలల మధ్య కేవలం 3.9 బిలియన్ డాలర్లే. ఇంకా విదేశీ సంస్థాగత పెట్టుబడులు మొదటి త్రైమాసికంలో 11.9 బిలియన్ డాలర్ల మేర వృద్ది చెందాయి. అదే గతేడాది మొదటి త్రైమాసికంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు కేవలం 1.2 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com