ఎయిర్‌టెల్‌ బంపర్ ఆఫర్

- September 16, 2017 , by Maagulf
ఎయిర్‌టెల్‌ బంపర్ ఆఫర్

ఎయిర్‌టెల్‌ తన మాన్‌సూన్‌ ఆఫర్‌ ముగియడానికి వస్తున్న క్రమంలో పోస్టు పెయిడ్‌ కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా మరో ఉచిత డేటా ఆఫర్‌ను తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ప్లాన్‌ కింద యూజర్లు ఆరు నెలల పాటు 60జీబీ ఉచిత డేటాను పొందనున్నారు. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు తొలుత ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను తమ ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రక్రియ పూర్తయితే, 24 గంటల్లో ఈ ఉచిత 60జీబీ డేటా ప్రయోజనాలు యూజర్లకు క్రెడిట్‌ అవుతాయి. నెలకు 10 జీబీ చొప్పున ఆరు నెలల పాటు మొత్తం 60జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌​ పోస్టుపెయిడ్‌ కస్టమర్‌, మైఎయిర్‌టెల్‌ యాప్‌ యూజర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు మై ఎయిర్‌టెల్‌ యాప్‌ లేని వారు కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కంపెనీ సూచించింది. 
 
ఈ ఆఫర్‌ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి....
తొలుత మైఎయిర్‌టెల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి
ఫ్రీ డేటాను క్లయిమ్‌ చేసుకునే ప్రక్రియ బ్యానర్‌గా కనిపిస్తూ ఉంటుంది
ఆ బ్యానర్‌ను క్లిక్‌ చేయాలి
స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ వెళ్లాలి
ఎయిర్‌టెల్‌ టీవీ ఏపీకే అని వస్తుంది, దాన్ని మీ స్మార్ట్‌ఫోన్లలోకి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి
యూజర్లు దీన్ని విజయవంతంగా డౌన్‌లోడ్‌ చేసుకున్నాక, ఉచిత డేటా 24 గంటల్లో క్రెడిట్ అవుతుంది
 
ఈ కొత్త ఆఫర్‌ అచ్చం కొన్ని నెలల క్రితం ఎయిర్‌టెల్‌ లాంచ్‌చేసిన మాన్‌సూన్‌ ఆఫర్‌ లాంటిదే. ఎయిర్‌టెల్‌ మాన్‌సూన్‌ ఆఫర్‌ కింద, తన పోస్టుపెయిడ్‌ కస్టమర్లకు నెలకు 10జీబీ ఉచిత డేటాను కంపెనీ అందిస్తోంది. అయితే ఆ ఆఫర్‌ మూడు నెలలే వాలిడ్‌లో ఉంటే, ఈ ఆఫర్‌ ఆరు నెలల వ్యవధిలో వాలిడ్‌లో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఆటోమేటిక్‌గా నెలకు 10జీబీ డేటాను క్రెడిట్‌చేస్తోంది. ఎయిర్‌టెల్‌ టీవీ ఆప్‌ ఇన్‌స్టాలేషన్లను పెంచడానికి ఈ ఆఫర్‌ ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com