ప్రపంచపు చూపు... బహ్రైన్ వైపు
- October 30, 2015
ప్రపంచ నేతలు నేడు బహ్రైన్లో ప్రారంభమై , ఈ ఆదివారం వరకు కొనసాగనున్న 11 వ అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ప్రాంతీయ భద్రతా సదస్సు -' ద మనామా డైలాగ్ 2015' లో పాల్గొనడానికి రిట్జ్ కార్ల్టన్ బహ్రైన్, హోటెల్ అండ్ స్పా లో సమావేశం కానున్న సందర్భంలో ప్రపంచం అంతా బహ్రైన్ వైపు దృష్టి కేంద్రీకరించింది. నేటి రాత్రి బహ్రైన్ యువరాజు, మొదటి ఉపాధ్యక్షులు, డేప్యూటీ సుప్రీం కమాండర్ ఐన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా అతిధ్యమివ్వనున్న విందులో, ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా అల్ సిసి కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న పెరుగుతున్న తీవ్రవాదం, విభజనవాదం మరియు మధ్య ప్రాచ్య వివాదాలు వంటి సవాళ్లను గురించి చర్చించడానికి మధ్య ప్రాచ్యం మరియు ప్రపంచ వ్యాప్తంగా - బ్రిటన్ విదేశాంగ సెక్రటరీ ఫిలిప్ హ్యామండ్, అమెరికా డేప్యూటీ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్, అరబ్ లీగ్ సెక్రెటరీ జనరల్ డా. నాబీల్ అల్ అరబి, స్వీడన్ విదేశాంగ శాఖ మంత్రి మార్గొ ట్ వాల్స్ట్రోమ్, ఐక్యరాజ్య సమితి యెమన్ దేశ ప్రత్యేక రాయబారి ఇస్మైల్ షేక్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పధక అధికారి మరియు న్యూ జీలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, ఇరాక్ ఆర్ధిక మంత్రి హొషియార్ జాబారీ మరియు విదేశాంగ శాఖామంత్రి డా. ఇబ్రహీం అల్ జాఫారీ, యెమన్ విదేశాంగ శాఖామంత్రి రియాద్ యాసిన్, ఈజిప్టు విదేశాంగ శాఖమంత్రి సమేహ్ షౌక్రీ వంటి వివిధ దేశాల మంత్రులు మరియు నిపుణులు హాజరు కానున్న ఈ సమావేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి.
బహ్రైన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ, షేక్ ఖలిద్ అహ్మద్ బిన్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ స్థిరత్వాన్ని సాధించేందుకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అతి ముఖ్యమైనదిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









