'2 ఫ్రెండ్స్‌' షూటింగ్ పూర్తి

- September 18, 2017 , by Maagulf
'2 ఫ్రెండ్స్‌' షూటింగ్ పూర్తి

ప్రేమ గొప్పదా లేక స్నేహమా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం '2 ఫ్రెండ్స్‌' (ట్రూ లవ్‌). నేడు యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువతకు భవిష్యత్తు నిర్దేశం అవుతుంది. ప్రేమకంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపొందింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నఈ చిత్రానికి జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో అనంతలక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు షెడ్యూల్ లో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో సూరజ్‌ హీరోగా నటిస్తుండగా రవీంద్రతేజ, సానియా, స్నిగ్ద, కార్తీక్‌, సారా, ధన్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌ రెడ్డి, వై.విజయ, శ్రీలక్ష్మి ఇతర పాత్రధారులు నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com