పనామా విమానాశ్రయంలో 200 విమానాలు రద్దు
- September 19, 2017
పనామా: లాటిన్ అమెరికాలో పనామా సిటీ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విమానాశ్రయం పవర్ సర్క్యూట్ ప్యానెల్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో దాదాపు 200 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. పలు విమానాలు ఆలస్యమవడంతో వేలాది మంది ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చింది.
అమెరికా, యూరప్ దేశాల ప్రయాణికుల ప్రధాన గమ్యస్థానం అయిన పనామా సిటీ విమానాశ్రయం సర్క్యూట్ ప్యానెల్‌లో విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. దీంతో విమాన రాకపోకలను నియంత్రించే వ్యవస్థ పనిచేయటం మానేసింది. ఈ పరిణామంతో 200 విమానాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికులతో ఎయిర్‌పోర్టు నిండిపోయింది. అధికారులు బస్సులు ఏర్పాటు చేసి వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు లగేజీలను పక్కన ఉంచుకుని విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
పనామా ప్రభుత్వ కోపా ఎయిర్‌లైన్స్ ఈ పరిణామంతో తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 140 సర్వీసులను రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. కొన్ని గంటల తర్వాత రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రద్దీ కొనసాగుతూనే ఉంది. పరిస్థితి చక్కబరిచేందుకు మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు నుంచి నిత్యం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాతోపాటు యూరప్ ఖండాల్లోని 90 ప్రాంతాలకు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాదికి దాదాపు 14 మిలియన్ల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







