స్మార్ట్‌ దుబాయ్‌: భారతీయ వలసదారులకోసం ఓ యాప్‌

స్మార్ట్‌ దుబాయ్‌: భారతీయ వలసదారులకోసం ఓ యాప్‌

బ్లాక్‌ అండ్‌ వైట్‌ కంప్యూటర్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఎల్‌ఎల్‌సి, స్మార్ట్‌ లేబర్‌ పేరుతో ఓ యాప్‌ని రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా, కార్మికులకు ఎంతో ఉపయోగకరమైన విషయాల్ని ప్రాచుర్యంలోకి 'స్మార్ట్‌'గా తీసుకొచ్చామని యాప్‌ తయారీ ప్రతినిథులు పేర్కొన్నారు. మనీ మేనేజ్‌మెంట్‌, కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌, బేసిక్‌ కంపెనీ పాలసీలు వంటివాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఇందులో పొందుపర్చారు. యూఏఈలో నివసించే కార్మికులకు ఇక్కడి చట్టాలు, పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఈ యాప్‌ కల్పిస్తుంది. భారతీయ వలసదారుడు అబు ముయాద్‌ మదిలోంచి మెదిలిన ఆలోచన ఈ యాప్‌ రూపకల్పనకు మార్గం సుగమం చేసింది. 2016 మేలో ఈ యాప్‌ ప్రారంభించగా, 12,500 రిజిస్టర్డ్‌ యూజర్స్‌ మెప్పు పొందింది ఈ యాప్‌. అరబిక్‌, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్‌ వినియోగదారులకు ఉపకరిస్తుంది. 

Back to Top