బహ్రెయిన్‌ - ఇండియా సంబంధాలు మరింత బలోపేతం

- September 19, 2017 , by Maagulf
బహ్రెయిన్‌ - ఇండియా సంబంధాలు మరింత బలోపేతం

న్యూయార్క్‌: బహ్రెయిన్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ షేక్‌ ఖాలిద్‌ బిన్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖలీపా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో యునైటెడ్‌ నేషన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ - న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. 72వ సెషన్‌ యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో, బహ్రెయిన్‌ - భారత దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయనీ, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలు అభివృద్థి పథంలో ముందుకు వెళ్ళాలని వారు ఆకాంక్షించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com