హిజ్రి న్యూ ఇయర్‌ హాలీడే: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్‌

- September 20, 2017 , by Maagulf
హిజ్రి న్యూ ఇయర్‌ హాలీడే: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్‌

దుబాయ్‌: మల్టీ లెవల్‌ పార్కింగ్‌ లాట్స్‌ మినహా అన్ని పార్కింగ్‌ జోన్స్‌లోనూ దుబాయ్‌ వ్యాప్తంగా ఉచిత పార్కింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. హిజ్రి న్యూ ఇయర్‌ హాలీడే సందర్భంగా వాహనదారులకు రెండ్రోజులపాటు ఈ ఫ్రీ పార్కింగ్‌ అందుబాటులో ఉంటుంది. శనివారం నుంచి పార్కింగ్‌ ఫీజు యాక్టివేట్‌ చేయబడ్తుందని రోడ్స్‌ మరియు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఆర్‌టిఎ వెల్లడించింది. గురువారం మెట్రో రెడ్‌ లైన్‌ స్టేషన్లు ఉదయం 5.30 నిమిషాల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తాయి. గ్రీన్‌ లైన్‌ స్టేషన్స్‌ ఉదయం 5.50 నిమిషాల నుంచి 1 గంట వరకు పనిచేస్తాయి. దుబాయ్‌ ట్రామ్‌ సర్వీసులు ఉదయం 6.30 నిమిషాల నుంచి 1 గంట వరకు పనిచేస్తాయి. మెయిన్‌ బస్‌ స్టేషన్స్‌ కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు పనిచేస్తాయి. అల్‌ గుబైదా స్టేషన్‌ 5 గంటల నుంచి 12.10 నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది. మెట్రో లింక్‌ బస్‌ స్టేషన్స్‌ పలు ప్రాంతాల్లో 5 గంటల నుంచి 12.20 నిమిషాల వరకు సేవలందిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com