గదిలో పెట్టి తాళం వేసిన భర్త ..మేడపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన భార్య

- September 20, 2017 , by Maagulf
గదిలో పెట్టి తాళం వేసిన భర్త ..మేడపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన భార్య

షార్జా: భార్య భర్తల మధ్య సరిగా శ్రుతులు కలవకపోతే వారి సంసార సంగీతం కర్ణకఠోరంగా మారుతుంది. రోజూ కట్టుకొన్న భార్యను ఇంట్లో దాచి తాళం పెట్టి వెళ్లే  ఆ భర్త చేసే ఆగడాలకు తాళలేక కిటికీ లోంచి దూకి ఆత్మహత్యయత్నం  చేసిందో భార్య ..అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. యూఏఈలోని షార్జాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇటీవల  సంచలనం కల్గించింది.  . షార్జాలో రద్దీగా ఉండే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్థు కిటికీ నుంచి ఓ మహిళ అమాంతం దూకేసింది. తీవ్రగాయాల పాలయి ఉన్న ఆమెను స్థానికులు అల్ ఖసైమీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సెప్టెంబర్ 8వ తారీఖున జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఈ కేసుపై  పోలీసులు విచారణ చేస్తున్నారు. తాను ఆత్మహత్యకు యత్నించాననీ, ప్రాణాలపై ఆశలేదని పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది. భర్త పెట్టే హింసను తట్టుకోలేకే ఈ ఘోరానికి పాల్పడ్డానని చెప్పింది. అయితే భార్య ఇచ్చిన మరణవాంగ్మూలం పూర్తి విరుద్ధంగా భర్త తన వాదనను వినిపించాడు. పద్ధతిగా ఉండాల్సిన భార్య దారితప్పినట్లు అనుమానం వచ్చిందని, గమనిస్తే నిత్యం తానూ బైటకు వెళ్లిన తర్వాత ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించిందన్నాడు. తాను ఆమెని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఆమెను గదిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లానని, అయితే తీరా వచ్చి చూసే సరికే ఈ ఘోరానికి పాల్పడిందని వాపోయాడు. తాను ఆమెకు చిన్న శిక్షను మాత్రమే విధించి తనలో మార్పు వచ్చేలా చేద్దామనుకున్నాననీ, అయితే ఇలా జరుగుతుందని తాను భావించలేదనన్నాడు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసుకు సంబంధించిన తీర్పు.. త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com