“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం మొదటి బహుమతి 10 లక్షలు
- September 20, 2017
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా (1017-2017) 216 అడుగుల సమతా మూర్తి పంచలోహ విగ్రహ నిర్మాణాన్ని పురస్కరించుకుని, నేటి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ రామానుజాచార్య జీవిత ఇతివృత్తం, ఆయన సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఆవిష్కరించే విధంగా జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ (జీవ) మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ & సేవ్ టెంపుల్స్.ఆర్గ్(USA) సంయుక్త అద్వర్యంలో 2018 ఫిబ్రవరి 1నుండి 4 వ తేది వరకు “శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం” నిర్వహించనున్నట్లు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామివారు మరియు సేవ్ టెంపుల్స్ ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం ఫిబ్రవరి 1-3 వ తేది వరకు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లోను, ఫిబ్రవరి 4 వ తేదిన అవార్డుల ప్రదానోత్సవం శంషాబాద్ లోని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ ఆశ్రమం లోను జరుగుతాయని తెలిపారు.
లఘు చిత్రాలు కేవలం శ్రీ రామానుజాచార్య వారి జీవిత వృత్తాంతం మీద, ఆయన ఆదర్శాలు, సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు తదితర విషయాల మీద ఉండాలని, లఘు చిత్ర నిడివి కేవలం 8 నిమిషముల లోపు మాత్రమే ఉండాలని, లఘు చిత్రాలు ఏ భాషలోనైనా నిర్మాణం చేయవచ్చునని కాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ విధిగా ఉండాలని వారు కోరారు.
ఈ పోటీలలో పాల్గొనదలచినవారు ఈ క్రింద తెలిపిన చిరునామాకు 1 డిసెంబర్ 2017 లోపు తమ ఎంట్రీలను పంపించాలని, అలాగే స్క్రీనింగ్ కొరకు జ్యూరిచే ఎంపిక చేయబడిన లఘు చిత్రాల వివరాలను 10 జనవరి 2018 న తెలియపరుస్తామని తెలిపారు.
GHHF & Savetemples.org
H.No. 6-3-596/47/2,
Sapthagiri Building,
Sri Venkata Ramana Colony,
Khairatabad, Hyderabad-500 004. India
Ph: +91 99126 26256
ఈ పోటీలో గెలుపొందిన ఉత్తమ లఘు చిత్రానికి పదిలక్షల రూపాయలు నగదు బహుమతితో పాటు శ్రీ రామానుజ సహస్రాబ్ది పురస్కారం, ఉత్తమ ద్వితీయ చిత్రానికి ఎనిమిదిలక్షల రూపాయలు నగదు బహుమతి, తృతీయ చిత్రానికి గాను ఆరులక్షల రూపాయలు నగదు బహుమతి ని అందజేస్తామని, వీటితో పాటుగా మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి లక్ష రూపాయలు చొప్పున ఉంటాయని, వీటితోపాటుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహుకరించబడతాయని తెలిపారు. అలాగే పంపిన ప్రతి ఎంట్రీకి ప్రశంసా పత్రాలు అందజేయబడతాయని తెలిపారు.
• మీరు తీసిన డాక్యుమెంట్రీలు విధిగా (1920 x 1080) MP4 HD ఫార్మాట్ లో ఉండాలి
• రెండు DVD లను పంపాలి
• DVD లతో పాటుగా చలనచిత్రాలు ప్రదర్శించుటకు అనుమతి పత్రం జత పరచి పంపాలని కోరారు.
మరిన్ని వివరాల కొరకు మరియు ఆన్ లైన్ ఎంట్రీ కొరకు మా వెబ్ సైట్ www.savetemples.org చూడగలరని తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







