దుబాయ్ పోలీసుల పనితీరుని ప్రశంసించిన స్పెయిన్ మహిళ

- September 21, 2017 , by Maagulf
దుబాయ్ పోలీసుల పనితీరుని ప్రశంసించిన స్పెయిన్ మహిళ

దుబాయ్:  దుబాయ్ పోలీసుల పనితీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.  ఇటీవల  స్పెయిన్‌కు చెందిన ఓ మహిళ.. సఫారి ట్రిప్ కోసం దుబాయ్ నగరం వచ్చింది. పర్యటనలో భాగంగా ఓ రోజు తన బ్యాగును వాహనంలో ఉంచి మరచిపోయింది. బ్యాగులోని ఫోన్‌ను వాహన డ్రైవర్ అపహరించాడు. ఆమె  తిరిగొచ్చి బ్యాగును పరిశీలిస్తే ఆమెకు తన ఫోన్ ఎంత వెతికినప్పటికీ కనిపించలేదు. ఫోన్ మినహా మిగిలిన  వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయి. ఫోన్ ఎక్కడో జారిపోయి ఉండొచ్చని  భావించిన ఆమె స్వదేశానికి తిరిగివెళ్లింది. ఇంటికి వెళ్లిన తర్వాత తన కెమేరాను పరిశీలించగా ఫోన్‌ను ఎవరో దొంగిలించారని ఆ వీడియోలో  గుర్తించింది. అదృష్టవశాత్తు ఆమె వీడియో కెమేరా బ్యాగులో ఆన్‌చేసి ఉండడంతో ఫోన్‌ను ఎవరో చేతితో తీస్తున్నట్టు అర్థమవ్వడంతో ఆమె ఆ వీడియోని జత చేస్తూ  దుబాయ్ పోలీసులకు ఓ ఈ మెయిల్ పంపించింది. తన ఫోన్‌ను ఎవరో దొంగిలించారని ఫిర్యాదులో ఆయా వివరాలను పేర్కొంది. దీంతో దుబాయ్ పోలీసులు వెంటనే స్పందించి కేసుపై దర్యాప్తు జరిపి ఆమె ఫోన్‌ను ఎవరు దొంగిలించారో కనిపెట్టారు. వాహన డ్రైవర్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని తేల్చారు. దొంగ నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. స్పెయిన్‌లోని మహిళ ఇంటి అడ్రెస్స్ కు ఆ  ఫోన్‌ను పంపించారు. తనకు వచ్చిన పార్సెల్ లో తానూ పోగొట్టుకొన్న ఫోన్ ను చూసిన మహిళ నమ్మలేకపోయింది. దుబాయ్  పోలీసుల పనితీరు నిజంగా అద్భుతమంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని  దుబాయ్ పోలీసులకు పంపించింది. దీంతో దుబాయ్ పోలీసులపై ప్రసంశలు జల్లుకురుస్తోంది. ఈ విషయాన్నిటూరిస్ట్ పోలీసు డైరెక్టర్ లెఫ్టనెంట్ కొలోనిల్ ముబారక్ సయీద్ సలీం బిన్ నవాస్ స్థానిక విలేకరులకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com