దుబాయ్ లో స్మార్ట్ గ్రిడ్ స్టేషన్ ను నిర్మించనున్న 'దేవా'
- October 31, 2015
దుబాయ్ లోని రువయ్యా లో స్మార్ట్ గ్రిడ్ స్టేషన్ (ఎస్. జి. ఎస్.) ను నిర్మించడానికి దుబాయి విద్యుఛక్తి మరియు నీటి సంస్థ (దేవా) మానేజింగ్ డైరక్టర్ మరియు సి. ఈ. ఓ. - సయీద్ మొహమ్మద్ అల్ తయేర్ మరియు కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (కేప్‌కో) సీక్ చో హ్వాన్ ఐక్ ఒక ఒప్పంద పత్రం మీద సంతకం చేశారు. దుబాయి మరియు దక్షణ కొరియాలలో ఉత్తమ మౌలిక వసతులు పెంపొందించడానికి రెండు సంస్థల కృషిని ఈ ఒప్పందం తెలియజేస్తోంది. ఈ పైలట్ ప్రోజెక్టు - స్మార్ట్ గ్రిడ్లను, స్మార్ట్ సిటీలను, బెంచ్ మార్క్ లను గురించిన సమాచార నివిమయానికి, అవగాహనను పెంపొందించే పరస్పర వర్క్ షాప్ లను ఏర్పాటుచేయడానికై ఉద్దేశించి 2014 సంవత్సరంలో ఇరుపక్షాలు సంతకాలు చేసిన అవగాహనా పత్రం లో భాగమని తెలియవచ్చింది. పవన విద్యుత్తు, బాటరీ ద్వారా శక్తి నిల్వ మరియు భవన నిర్వహణ, భవన పైకప్పులపై ఫోటో వోల్టాయిక్ ప్యానల్ అమరిక వంటి కార్యక్రమాల ద్వారా దుబాయిని మూడు సంవత్సరాలలో ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









