కారులో చిన్నారి: ఈ ఏడాది 79 కేసులు
- September 23, 2017
లాక్ చేసిన కార్లలో చిన్నారుల్ని విడిచిపెట్టడం ప్రమాదకరమని ఎంతగా ప్రచారం చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా కూడా ఈ తరహా ఘటనలు ఇంకా చోటుచేసుకుంటూనే ఉండడం దురదృష్టకరం. ఈ ఏడాది ఇప్పటిదాకా 79 మంది చిన్నారులను లాక్ చేసిన కార్లలోంచి క్షేమంగా బయటకు తీశారు పోలీసులు. దుబాయ్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెర్చ్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ లెఫ్టిశ్రీనెంట్ కల్నల్ అహ్మద్ అతీజ్ బోర్‌గుయైబా మాట్లాడుతూ, కార్లలో చిన్నారుల్ని వదిలిపెట్టడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. 'ఏసీ ఉంది కదా అని వదిలేయడం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే పిల్లలు కార్‌లో కుదురుగా ఉండరు. ఏదో ఒకటి చేస్తుంటారు, తద్వారా ప్రమాదాలు తప్పవు. ఒక్కోసారి ఏసీ ఆఫ్ అయిపోయి, ఊపిరి ఆడక చనిపోతుంటారు' అని వివరించారాయన. కాస్సేపు షాపింగ్ కోసం పిల్లల్ని తీసుకెళ్ళడం కష్టంగా భావించి తల్లిదండ్రులు కార్లలో తమ పిల్లల్ని విడిచిపెట్టడం దారుణమని ఆయన అన్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్స్ విషయంలోనూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తగినని సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయో లేదో తల్లిదండ్రులు చూసుకోవాలని లెఫ్టినెంట్ కల్నల్ బోర్‌గుయైబా చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







