భళా మేరీకోమ్‌!

- September 23, 2017 , by Maagulf
భళా మేరీకోమ్‌!

హైదరాబాద్: భారత మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌కు అరుదైన అవకాశం దక్కించుకుంది. నవంబర్లో జరిగే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్‌ ఫోరంలో ఆమె అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ) ప్రతినిధిగా పాల్గొనబోతోంది.
దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మేరీ కోమ్ గతేడాది 'ఐబా' లెజెండ్స్‌ అవార్డు అందుకుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ అయిన మేరీ కోమ్ నవంబర్‌ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే 8వ ఐఓసీ అథ్లెట్స్‌ ఫోరంలో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.
'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఈ ఫోరంలో పాల్గొని తమ అభిప్రాయాల్ని పంచుకోవడమే ఈ వేదిక ఉద్దేశం' అని ఐబా భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌కు లేఖ రాసింది. అయితే వియత్నాంలో నవంబర్‌ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది.
ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్‌లో మేరీ కోమ్‌ ఎంపికైతే అథ్లెట్స్‌ ఫోరంలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com