త్వరలో రాజకీయాల్లోకి సుమన్ అరంగేట్రం
- September 24, 2017
గత కొంత కాలం గా తన ఫాన్స్ తో , ఫ్రెండ్స్ తో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరో సుమన్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ అప్పట్లోనే న్యూస్ వినిపించింది.
అదే విషయం ఆయన్ని మీడియా అడిగితే అదేమీ లేదు అనీ తనకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పిన సుమన్ తాజాగా తన పాలిటిక్స్ ఎంట్రీ విషయం లో మాట మార్చారు.
త్వరలోనే తాను రాజకీయంగా అడుగు పెట్టబోతున్నా అనీ పార్టీ ఏది అనే విషయం లో తనకి ఇంకా స్పష్టత రాలేదు అనీ అన్నారు. రాజకీయాల్లో నాయకులుగా ఉండే చాలామంది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు అనీ తను అలా జనాలని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాను అని సుమన్ చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు సుమన్ వివరించారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తానని సుమన్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







