'మహానుభావుడు' కు అతిధిగా విచ్చేయనున్న ప్రభాస్

- September 24, 2017 , by Maagulf
'మహానుభావుడు' కు అతిధిగా విచ్చేయనున్న ప్రభాస్

హైదరాబాద్‌: శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మహానుభావుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సార్‌ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు. కాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను నేటి సాయంత్రం నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌ దీనికి వేదిక కానుంది. అయితే ఈ వేడుకకు డార్లింగ్‌ ప్రభాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మెహరీన్‌ కథానాయిక పాత్ర పోషించారు. ఎస్‌. తమన్‌ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

వినోదాత్మకంగా సాగే ఈ ప్రచార చిత్రానికి మంచి స్పందన లభించింది. శుభ్రతకు ప్రాణం ఇచ్చే వ్యక్తి పాత్రలో శర్వానంద్‌ కనిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com