పూరీ తనయుడితో సినిమా హీరోయిన్ బెంగళూరు భామ నెహాశెట్టి
- September 24, 2017
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్‌తో సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. రొమాంటిక్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయట. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకాశ్‌కు జోడీగా బెంగళూరు భామ నెహాశెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. పూరీ సొంత సంస్థ పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. నటి ఛార్మి ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకోనున్నారట.
అక్టోబరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పూరీ అనుకుంటున్నారట. నెహాశెట్టి నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది.
ఆకాశ్ 'చిరుత' చిత్రంలో రామ్‌చరణ్ చిన్నప్పటి పాత్రతో బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇందులో అతడి నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అతడు మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, ప్రభాస్ సినిమాల్లో బాలనటుడిగా చేశారు. 2015లో 'ఆంధ్రాపోరి' సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









