ఒక వ్యక్తిని హత్య చేసి సముద్రంలో విసిరేసిన ముగ్గురు ఆసియా దేశస్థులు అరెస్ట్
- September 26, 2017
మస్కట్ : ఒక వ్యక్తిని చంపి సముద్రంలో విసిరివేసిన ఓ ముగ్గురు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ బటినా పోలీసుల ముఖ్య కేంద్రంలో విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖ ఆ హత్య కేసులో ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు. ఆయన " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఈ ముగ్గురు నిందితులు ముస్సానా విలాయత్ లోని హతుని ఇంటికి వెళ్లి బైటకు తీసుకువచ్చి చంపి ఆ వ్యక్తి శరీరాన్నిసముద్రంలోకి విసిరివేసారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారిపై అభియోగాలు మోపి నిందితుల అందరిని తదుపరి దర్యాప్తు కోసం న్యాయ అధికారులకు సూచించబడినట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







