హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంబరాన్నంటిన మహా బతుకమ్మ సంబురం..
- September 26, 2017
టు చూసినా పూల పరిమళాలే.. ఏ నోట విన్నా బతుకమ్మ పాటలే.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ పండుగ వాతావరణం కనిపించింది. భాగ్యనగరంలో మహా బతుకమ్మ వేడుక రంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు.
ఎల్బీ స్టేడియం పూల వనాన్ని తలపించింది.. మహా బతుకమ్మ వేడుక భాగ్యనగరంలో వైభవంగా జరిగింది..ఉయ్యాల పాటలతో ఎల్బీ స్టేడియం మారుమోగింది..35 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి..31 జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలకు రాష్ట్రం నలుమూలల మహిళలు తరలివచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత వేడుకలను ప్రారంభించి మహిళలతోకలిసి బతుకమ్మ ఆడారు. స్టేడియం మొత్తం కలియతిరుగుతూ వివిధ గ్రూపుల వద్ద బతుకమ్మ ఆడారు.
19 రాష్ర్టాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 15 రాష్ర్టాల నుంచి బ్రహ్మకుమారీలు రంగు రంగుల దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు కూడా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







