విక్ర‌మ్‌, స‌మంత నటించిన `10` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

- September 26, 2017 , by Maagulf
విక్ర‌మ్‌, స‌మంత నటించిన `10` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
శివ‌పుత్రుడు, అప‌రిచితుడు  చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ చియాన్ విక్ర‌మ్ హీరోగా బ్యూటీఫుల్ స‌మంత హీరోయిన్‌గా రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `10 ఎన్న‌త్తు కుల్ల‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ నిర్మించిన ఈ చిత్రం త‌మిళంలో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. ఫాక్స్‌స్టార్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్ర‌మ‌ణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింత‌ప‌ల్లి ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు. అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున‌్నారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com