క్రెడిట్ కార్డుల్ని తిరస్కరిస్తే షాప్స్పై జరీమానాలు తప్పవు
- September 27, 2017
జెడ్డా: చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్న సమయంలో షాప్‌ల నిర్వాహకుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్పందించింది. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల్ని షాప్‌లు తిరస్కరిస్తే, అలాంటి షాప్‌లపై జరీమానాలు విధిస్తామని హెచ్చరించింది. అలాగే స్వాపింగ్ మెషీన్లను కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్ పట్ల ప్రాచుర్యం కల్పిస్తోంటే షాప్‌ల నిర్వాహకులు అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు షాపుల నిర్వాహకుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూసినప్పుడు 2017 రెండో అర్థభాగంలో పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ 15.91 శాతం పెరిగాయి. అయితే బిల్లుకు అదనంగా ఛార్జీల రూపంలో షాప్‌ల నిర్వాహకులు వసూలు చేస్తుండడం, కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డులను తిరస్కరిస్తుండడం ద్వారా కొనుగోళ్ళు మందగించే ప్రమాదముందని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే స్పష్టమైన హెచ్చరికల్ని షాప్‌ల నిర్వాహకులకు జారీ చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







