ఆన్లైన్ సామాజిక మాధ్యమం ట్విటర్ ఖాతాదారులకు శుభవార్త...
- September 27, 2017
ఆన్లైన్ సామాజిక మాధ్యమం ట్విటర్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకూ ఎవరైనా ట్విటర్ వేదికగా తమ భావాలను పంచుకోవాలంటే ఆ భావాన్ని కేవలం 140 అక్షరాల్లోనే చెప్పాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ట్విటర్ ప్రియులకు ఆనందం 'డబుల్' కానుంది. ట్వీట్ అక్షరాల పరిమితి 280కు పెంచుతూ చేపట్టిన టెస్ట్ ప్రాజెక్టు విజయవంతగా పనిచేస్తోందని ట్విటర్ తెలిపింది. ఇది ట్విటర్‌కు మరింత వూతం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ట్విటర్ 2006లో ప్రారంభమైంది. ఆంగ్ల భాషను దృష్టిలో పెట్టుకుని ఒక ట్వీట్‌కు కేవలం 140 అక్షరాల పరిమితిని విధించింది. అయితే ఇతర భాషల వారు ట్వీట్ చేసే సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆసియా, చైనా దేశాలకు ఈ సమస్య పెద్దదిగా ఉంది. దీంతో ట్వీట్ అక్షరాల పరిమితిని పెంచేందుకు ట్విటర్ కార్యాచరణ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా పరీక్షించింది. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









