కాబుల్ లో రాకెట్ దాడి, బాంబు పేలుళ్లు
- September 27, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉదయం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాకెట్లతో విరుచుకుపడ్డ దుండగులు.. ఇప్పుడు బాంబు దాడులకు దిగారు. 25 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. నేటి ఉదయం ఎయిర్‌పోర్టు సమీపంలో రాకెట్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. 20 నుంచి 30 రాకెట్లు పడ్డట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఆరు రాకెట్లు మాత్రమే పడినట్లు తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ఎయిర్‌పోర్టును ఖాళీ చేయించారు. పలు విమానాలను రద్దు చేశారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటీస్ అఫ్గాన్‌కు చేరుకున్న కొద్ది గంటలకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. నాటో స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







