అల్‌ ఖైల్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యకి 15 మిలియన్‌ దిర్హామ్‌ ప్రాజెక్ట్‌తో చెక్‌

- September 27, 2017 , by Maagulf
అల్‌ ఖైల్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యకి 15 మిలియన్‌ దిర్హామ్‌ ప్రాజెక్ట్‌తో చెక్‌

దుబాయ్‌లో చేపడ్తున్న 15 మిలియన్‌ దిర్హామ్‌ విలువైన కొత్త ప్రాజెక్ట్‌ అల్‌ ఖైల్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యలనుంచి వాహనదారులకు ఉపశమనాన్నివ్వనుందని రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వెల్లడించింది. దుబాయ్‌ ప్రాపర్టీస్‌తో కలిసి ఆర్‌టిఎ ఈ ప్రాజెక్ట్‌ చేపడుతోంది. షేక్‌ రషీద్‌ రోడ్డు నుంచి కల్చరల్‌ విలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. 14.87 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన ఈ రపాజెక్ట్‌ కల్చరల్‌ విలేజ్‌ని సమీపంలో ఉన్న రోడ్స్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తుంది. ఆర్‌టిఎ ట్రాఫిక్‌ అండ్‌ రోడ్స్‌ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్‌ అదాయ్‌ మాట్లాడుతూ, రోడ్‌ యూజర్స్‌ సేఫ్టీ నిమిత్తం ఈ ప్రాజెక్ట్‌ చేపడుతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ అవసరాల్ని తీర్చేందుకు ఈ ప్రాజెక్ట్‌ ఉపకరిస్తుంది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌ నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com