అమెరికాకు మరో షాక్ 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు స్కూళ్లు మూసివేత

- September 27, 2017 , by Maagulf
అమెరికాకు మరో షాక్ 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు స్కూళ్లు మూసివేత

నిన్న మొన్నటి వరకు అమెరికాను హరికేన్లు అల్లాడించగా, ఇప్పుడు దావానలం వణికిస్తోంది. వరుస హరికేన్లు.. హార్వే, ఇర్మా, మారియా సృష్టించిన భయోత్పాతం మరువనే లేదు.. తాజాగా 2 వేల ఎకరాల్లో వ్యాపించిన మంటలు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.
కాలిఫోర్నియాలోని చైనో హిల్స్ స్టేట్ పార్క్‌లో మొదలైన కార్చిచ్చు ఇప్పటికే 1700 ఎకరాలను బూడిద చేసింది. రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం మొదలైన కార్చిచ్చు ఇప్పటి వరకు 2 వేల ఎకరాలకు వ్యాపించింది.
చెలరేగిపోతున్న కార్చిచ్చును ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓ విమానం సహా 300 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కార్చిచ్చుపై విమానంతో నీళ్లు కుమ్మరిస్తున్నారు.
మరోవైపు అధికారులు ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుుకుంటున్నారు. దావానలం కారణంగా సమీప ప్రాంతాల్లోని విద్యాలయాలను మూసివేశారు. 11 ప్రాంతాల్లోని ప్రజలను అత్యవసరంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com