ఎడారి వేడి నుండి 8 లక్షల మంది కార్మికులను కాపాడాలని ఫిఫా కతర్ ను కోరింది

- September 28, 2017 , by Maagulf
ఎడారి వేడి నుండి 8 లక్షల మంది కార్మికులను కాపాడాలని  ఫిఫా  కతర్ ను  కోరింది

దుబాయ్:  కతర్ ఆతిధ్యం ఇస్తున్న ఫుట్ బాల్  ప్రపంచ కప్ 2022 కు  8 లక్షల మంది మంది వలస కార్మికుల జీవితాలను రక్షించడానికి అత్యవసర చట్టాలను ప్రవేశపెట్టాలని మానవ హక్కులను గమనించే సంస్థ  బుధవారం పేర్కొంది. అదేవిధంగా న్యూయార్క్ ఆధారిత సంస్థ కూడా కార్మికుల మరణాలపై ఒక సమగ్ర  దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చింది. ఖతార్ అధికారులు  వేడి నుండి కార్మికులను రక్షించడానికి అత్యంత ప్రాధమిక రక్షణను ఏర్పాటుచేయడంలో వైఫల్యం చెందారని వారికోసం తీసుకొన్న నిర్ణయాలు ప్రజలకు తెలియజేయండని సూచించింది.కార్మికుల మరణాలను పరిశోధించే సిఫార్సులను పట్టించుకోకుండా మరియు ఈ మరణాలపై సమాచారం విడుదల చేయడం వారి బాధ్యత అని ఆ విషయాన్ని నిరాకరించిన తీరు శోచనీయమని రిపోర్టర్ రచయిత నికోలస్ మక్ గీహన్ చెప్పాడు. కతర్ యొక్క కార్మికుల కోసం వేడి మరియు తేమ నుండి రక్షణను కోరడానికి ఫుట్బాల్ యొక్క ప్రపంచ పాలక సంఘం, ఫిఫా , జాతీయ సంఘాలు మరియు ప్రపంచ కప్ ప్రాయోజితులు సైతం నిలదీస్తున్నారని మక్ గీహన్ తెలిపారు. వారు రెండు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారు. అవి ఏమిటంటే, 2012 నుండి ఎంత మంది కార్మికులు చనిపోయారు మరియు వారు  ఎలా మరణించారు? "jobsneneoo.com "  కతర్ లో జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి రోజూ 11:30 గంటలకు, 3:00 గంటలకు మధ్య పని చేయించే సంస్థల పట్ల తెలియచేయాలని కోరుతారని, మరి ఇక్కడ జరిగిన ఉల్లంఘనలు ఎందుకు పరిగణనంలోనికి తీసుకోరని ప్రశ్నించారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు  50 డిగ్రీల సెల్సియస్ (122 డిగ్రీల ఫారెన్హీట్) వరకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com