కోర్టు ప్రాంగణంలో మహిళ చెవి కొరికేసిన వ్యక్తి

- September 28, 2017 , by Maagulf
కోర్టు ప్రాంగణంలో మహిళ చెవి కొరికేసిన వ్యక్తి

ఓ మహిళ దుబాయ్‌ కోర్టులో తన వద్ద పనిచేసే ఫిమేల్‌ స్టాఫ్‌కి సంబంధించిన లేబర్‌ కేసు కోసం రాగా, అక్కడే ఆ ప్రాంగణంలోనే ఓ వ్యక్తి ఆమె చెవిని కొరికేశాడు. ఈ ఘటనలో ఆమె చెవికి శాశ్వత డ్యామేజీ జరిగింది. అయితే నిందితుడు మాత్రం తాను ఆమెపై దాడి చేయాలనుకోలేదనీ, తనపై దాడి జరుగుతున్న క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నించానని విచారణలో పోలీసులకు తెలిపాడు. అయితే బాధితురాలు మాత్రం తనపై నిందితుడు కావాలనే దాడి చేశాడననీ, ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నుంచీ అతడు తనను ఫాలో అవుతున్నాడనీ, సమయం చూసి తనపై దాడి చేశాడనీ, తన చెవి పూర్తిగా అతని నోటిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. నిందితుడు జరిపిన దాడిలోనే బాధితురాలు చెవిని కోల్పోయినట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. అక్టోబర్‌ 16వ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా పడింది. మే 14న ఈ ఘటన జరిగింది. తన భార్యను ఆమె యజమాని అయిన మహిళ వేధిస్తుండడంతోనే ఆమెపై నిందితుడు దాడి చేసినట్లు తెలియవస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com