రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోయే

- September 29, 2017 , by Maagulf
రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోయే

కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ దేశంలోని పలువురు ప్రముఖులకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఇందులో బాగంగా టాలీవుడ్ కు సంబధించి.. రాజమౌళి, మోహన్‌బాబు, ప్రభాస్‌, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్రమోదీ లేఖలు రాశారు.
ఈ లేఖపై తాజాగా ప్రభాస్ స్పదించాడు. " డియర్ ఆల్. పరిశుభ్రతకు ఎంతో విలువిచ్చిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో నేనూ భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాను. నా దేశాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ఓ పౌరుడిగా అది నా బాధ్యతే కాదు అలవాటు కూడా. నాలాగే మీరూ ఆలోచించి భారతదేశం శుభ్రంగా ఉండేలా మీ వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న దానికంటే మన దేశం మరింత అందంగా తయారవుతుంది. జై హింద్‌" అని సోషల్ మీడియా వేదికగా కోరాడు ప్రభాస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com