ఫిలిఫైన్స్ మహిళపై పాకిస్థాన్ నిందుతుని అత్యాచారయత్నం
- September 29, 2017
దుబాయ్: బరి తెగించిన ఓ కామాంధునికి బస్టాండ్ లో కనబడిన మహిళపై అత్యాచారయత్నం చేయబోయి స్థానికులకు దొరికిపోయాడు. గురువారం రాత్రి గం.10-30 బస్ ఎక్కేందుకు ఓ ప్రవాసీ మహిళా బస్టాండ్‌కు వచ్చింది.ఫిలిఫైన్స్ నుంచి దుబాయ్ వచ్చిన ఆమె ఒక నిర్మాణ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. విధులు ముగించుకొని బస్టాండ్ కి వచ్చింది. ఆ మహిళ బస్సు కోసం నిరీక్షిస్తున్నవేళ అక్కడే తచ్చట్లాడుతున్న పాకిస్థాన్ కు చెందిన నిందితుడు బస్టాండ్ లో ఎవరూ లేకపోవడం... పూటుగా మద్యం సేవించి ఉన్న నేపథ్యంలో ఆ వంటరి స్త్రీ పట్ల వెకిలిగా వ్యవహరించాడు. అంతటితో ఆగక ఒక్కసారిగా ఆమెపైకి దూసుకువెళ్ళాడు. పక్కనే ఉన్నరవాణా సరుకులు నిల్వ చేసే ఒక కంటెనర్‌లోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు..ఆమె బిగ్గరగా అరిచినప్పటికీ లాభం లేకపోయింది. కొద్దిసేపట్లోనే అదే బస్టాండ్ వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆమె అరుపులు విని కంటెనర్‌లోకి ఎక్కారు. ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాకిస్తాన్ నుంచి దుబాయ్ వచ్చాడని పోలీసులు తెలిపారు. నిర్మాణ సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడని వారు తెలిపారు. పోలీసులు అతడిని కోర్టులో హజరుపరిచారు. కోర్టు అతడికి ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







