ఏపీలో షూటింగులకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే బాలకృష్ణ

- September 30, 2017 , by Maagulf
ఏపీలో షూటింగులకు ప్రోత్సాహం: ఎమ్మెల్యే బాలకృష్ణ

విజయవాడ: రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని... యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు చొరవ తీసుకుంటామని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ నాలుగో అంతస్తులో చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యాలయాన్ని సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణతో కలిసి బాలకృష్ణ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించినట్లు తెలిపారు. భాషకు, కళకు బేధం లేదని... రాష్ట్రం విడిపోయిన తరుణంలో ప్రభుత్వ ఖజానాకు చలనచిత్ర కళాకారులు తమ వంతు ఆదాయం సమకూర్చేందుకు ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సినీ పరిశ్రమ హైదరాబాద్‌ నుంచి మొత్తం తరలి రావాలని కోరుకోవడం లేదని.. చిన్న చిత్రాలు, టీవీ సీరియళ్ల చిత్రీకరణను ప్రోత్సహిస్తామన్నారు. సినీ పరిశ్రమలోని ఎందరో ప్రముఖులకు కృష్ణా జిల్లాలో అనుబంధం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com