దసరా వేడుకల్లో పాల్గొననున్నభారత్ ప్రధాని,రాష్ట్రపతి
- September 30, 2017
న్యూ ఢిల్లీ: ఎర్రకోటలో నిర్వహించే దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు మోదీ.ఈ రోజు ఎర్రకోటలో జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపతి కూడా దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
దసరా వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014 తర్వాత మోదీ దసరా వేడుకలను ఢిల్లీలో జరుపుకోవడం ఇది రెండోసారి. 2015లో ఏపీలోని అమరావతిలో మోదీ పర్యటించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 2016లో లక్నోలో దసరా వేడుకలను జరుపుకున్నారు ప్రధాని మోదీ.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







