గాడిదకు 6,800 డాలర్లు ఫైన్..
- September 30, 2017
గాడిద. దీని గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. కానీ ఇది చేసే పని గురించి మాత్రం ఎక్కువ మాట్లాడుతారు. జర్మనీలో గాడిద ఓ విచిత్ర పని చేసింది. ఆ విషయం కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో ఆ గాడిదకు 6,800 డాలర్లు కట్టాలని ఫైన్ విధించింది. మరి గాడిద కట్టిందా...లేదా?
జర్మనీలో ఆరెంజ్ కలర్లో ఉన్న ఓ స్పోర్ట్స్ కారును మార్కస్ జాన్ కొనుకున్నాడు. తన పార్కింగ్ ప్లేస్లో జాన్ పార్క్ చేసుకున్నాడు. జాన్ పొరుగు ఇంట్లో వాళ్లు ఓ గాడిదను పెంచుకుంటున్నారు. ఆ గాడిద దూరంగా ఉన్న ఆరెంజ్ కలర్ స్పోర్ట్స్ కారును చూసి ...క్యారెట్ అనుకొని దానిని కొరికేసింది. కారు డ్యామేజ్ అయింది. ఇది గమనించిన జాన్ గాడిద ఓనర్ను నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. దానికి గాడిద ఓనర్ నిరాకరించాడు. దీంతో జాన్ కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు తప్పు గాడిద ఓనర్ ది అని తేల్చింది. దీంతో గాడిద ఓనర్కు 6,800 డాలర్లు ఫైన్ కట్టాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







