యూఏఈ లో అంగారక గ్రహ అనుభూతి .... 13.6 కోట్ల డాలర్ల వ్యయంతో నూతన నగరం

- September 30, 2017 , by Maagulf
యూఏఈ లో  అంగారక గ్రహ అనుభూతి .... 13.6 కోట్ల డాలర్ల వ్యయంతో నూతన నగరం

యూఏఈ : పెట్రో డబ్బులు ...పెట్రేగిపోయేలా చేస్తుందేమో ?  భూమి మీద కాపురముంటూ... అంగారకుడిపై నివసిస్తే ఎలా ఉంటుందో అనే అనుభూతి కోసం అరబ్బు షేకులు ఓ కొత్త నగరాన్ని నిర్మించబోతున్నారు. ‘మార్స్‌ సైంటిఫిక్‌ సిటీ’ పేరిట అద్భుతంగా కట్టబోతున్న ఈ ప్రాంతం అంగారకుడిని పోలిన వాతావరణంతో నిర్మాణమవుతోంది ఈ నగరం. మొత్తం విస్తీర్ణం 19 లక్షల చదరపు మీటర్లు. ఈ నగర నిర్మాణం కోసం అక్షరాలా 13.6 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు.  ఒక భారీ గోళాకారం వంటి నిర్మాణం లోపల ఉండే ఈ నగరంలో భవిష్యత్తులో అంగారకుడిపైకి చేరితే వ్యవసాయం  ఎలా చేయాలి ? తాగు నీరు ..సాగు నీరు ఎలా సేకరించాలి అనే అంశాలన్నింటిపైనా క్షుణ్ణంగా పరిశోధనలు జరుగుతాయి. వాస్తవం ఏమిటంటే యూఏఈ ఇప్పటివరకూ ఓ సొంత ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించలేదు కానీ.. కానీ అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఇంకో మూడేళ్లలోపున  అంగారకుడిపైకి ‘హోప్‌‘ పేరుతో ఓ అంతరిక్ష నౌకను పంపనుంది. యూఏఈ దేశం ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా.. అంటే 2021 నుంచి ఈ నౌక మార్స్‌ చుట్టూ పరిభ్రమించడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా ఇంకో వందేళ్లకైనా సరే.. అంగారకుడిపై తామే సొంతంగా నగరాన్ని కట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ మార్స్‌ సైంటిఫిక్‌ సిటీ ప్రాజెక్టుకు ప్రారంభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com