సోషల్ మీడియాలో మహిళ డ్రైవర్లను బెదిరిస్తున్న సౌదీ యువకుడు అరెస్టు

- October 01, 2017 , by Maagulf
సోషల్ మీడియాలో మహిళ డ్రైవర్లను బెదిరిస్తున్న సౌదీ యువకుడు అరెస్టు

జెడ్డా : మహిళలు పురుషులతో సమానంగా ఇకపై వాహనాలు నడపవచ్చని గల్ఫ్ దేశాలలో రాజాజ్ఞ జారీ అవుతుంటే మరో పక్క స్రీలు తమతో సమానం కాకూడదంటూ కొందరు సైకోలు తమ వికృత తత్వాన్ని ప్రదర్శిసిస్తున్నారు. తూర్పు ప్రావిన్స్లో లో సోషల్ మీడియాలో వాహనాలు నడపరాదని మహిళ డ్రైవర్లను బెదిరిస్తున్న ఒక యువకుడిని అరెస్టు చేశారు. వాహనాలు నడుపుతూ తనకు ఏ మహిళ అయినా  కనబడితే కాల్చివేస్తానని వీడియో క్లిప్ ని  సోషల్ మీడియా లో పోస్ట్ చే సాడు. రెండవ వీడియో సైతం ఇదే విధంగా బెదరిస్తూ మరల ఆ నిందితుడు పోస్ట్ చేసాడు. అది వైరల్ కావడమే కాక వెలుగులోకి  రావడం ఆ వ్యక్తిని గుర్తించేందుకు వీలు కల్గింది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా  పోలీసు ప్రతినిధి కల్నల్ జియాద్ అల్-రుకీతి మాట్లాడుతూ నిందితుడు 20 ఏళ్ళ సౌదీ యువకుడు అని పేర్కొంటూ అతడిని విచారణ చేయనున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com