తృటిలో తప్పిన ఘోర ఎయిర్ ఫ్రాన్స్ విమాన ప్రమాదం

- October 01, 2017 , by Maagulf
తృటిలో తప్పిన ఘోర ఎయిర్ ఫ్రాన్స్ విమాన ప్రమాదం

ప్రపంచ చరిత్రలో మరో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. 5 వందల ఇరవై మందితో వెళ్తున్న ఎయిర్‌ ఫ్రాన్స్‌ A 380 విమానం ఇంజన్‌ గాల్లోనే ధ్వంసమయ్యింది. దీంతో కెనడాలోని గూస్‌ బే ఎయిర్‌ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో.. ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

పారిస్‌ నుంచి లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్తున్న ఈ విమానంలో496 మంది ప్రయాణీకులతో పాటు 24 మంది సిబ్బంది ఉన్నారు. అట్లాంటిక్ సముద్రం మధ్యలోకి రాగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఓ ఇంజన్‌ పని చేయడం మానేసింది. పరిస్థితిని వెంటనే గమనించిన పైలెట్‌... ఆ విషయాన్ని ప్రయాణీకులకు చెప్పాడు... ఎమర్జెన్సీల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నామన్నాడు. దీంతో విమానంలో టెన్షన్‌ మొదలయ్యింది. పైలెట్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి దగ్గరలో ఉన్న గూస్‌ బే ఎయిర్‌పోర్ట్‌లో జాగ్రత్తగా దింపడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com