ఇంటి నుంచి తప్పిపోయిన 75 ఏళ్ల వృద్ధ మహిళను ఆమె కుమారునికి అప్పచెప్పిన షార్జా పోలీస్

- October 01, 2017 , by Maagulf
ఇంటి నుంచి తప్పిపోయిన 75 ఏళ్ల వృద్ధ మహిళను  ఆమె కుమారునికి అప్పచెప్పిన షార్జా పోలీస్

షార్జా: తాజా గాలి కోసం ఆరు బైటకు వచ్చిన ఆ వృద్ధురాలు దారి తప్పిపోయింది...ఎటు వెళ్లాలో తెలియక నిరసించి ఓ చోట కూర్చొండిపోయింది. షార్జా రూమిత ప్రాంతంలో తన కుటుంబంతోకల్సి నివసిస్తున్న ఆమెకు ఇంట్లో ఉక్కపోయడంతో అలా చల్లని గాలి కోసం వెలుపలకు వెళ్లడమే శాపమైంది. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఎక్కడకు వెళ్లాలో తెలియక కూలబడిన ఆ అవ్వకు ఆ పరిస్థితులలో వృద్ధ మహిళ ఎమిరాటీ మహిళ కంటపడింది.  ఆ 75 ఏళ్ల అరబ్ మహిళను తిరిగి ఆమె ఇంటికి చేర్చి షార్జా పోలీస్ తమ మానవత్వం చాటుకొన్నారు. షార్జాలో నివసించే తన కుమారుడు నివసిస్తున్న ఇంటికి వచ్చానని ఇంట్లో ఉండలేక తాజా గాలి కోసం వచ్చి ఇంటికి వెళ్లే మార్గాన్ని మర్చిపోయింది. తన కొడుకు ఇంటికి దారితీసిన వీధిని గుర్తించలేకపోతున్నట్లు ఆ వృద్ధురాలు చెప్పింది. దాంతో ఎమిరాటీ స్త్రీ ఆమెను పోలీసు శాఖ ట్రాఫిక్ మరియు లైసెన్స్ సర్వీసు సెంటర్ కు  తీసుకెళ్లి, ఆమె ఇంటి ఆచూకీ కోసం పలు ప్రయత్నాలను చేసిన తరువాత, పోలీసు అధికారులు ఆమె కుటుంబాన్ని గుర్తించడంలో విజయవంతమయ్యారు. వృద్ధ మహిళ కుమారుడిని పోలీస్  కేంద్రానికి పిలిపించారు. తన గుర్తింపును నిర్ధారించిన తరువాత, ఆ వ్యక్తికి అతని తల్లి అప్పగించబడింది. పోలీసులు  ఆ  కుమారుడికి మంచి జాగ్రత్తలు తెలపాలని, వృద్ధురాలైన తల్లిని ఆ విధంగా  ఒంటరిగా విడిచిపెట్టకూడదని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com