ఎమిరేట్స్ హరికేన్పై సౌదీ అరబ్ రేంజర్స్ విజయం
- October 02, 2017
మనామా: సౌదీ అరబ్ రేంజర్స్, ఎమిరేట్స్ హరికేన్ని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 2017 అరబ్ క్రికెట్ కార్నివాల్ టీ20 ఏడవ మ్యాచ్, రిఫ్ఫాలోని బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో జరగ్గా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ హరికేన్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. కపిల్ యాదవ్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌదీ అరబ్ రేంజర్స్ కేవలం 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. అమ్జాద్ ఖాన్ 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, సంజయ్ కనోలియా 58 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. బహ్రెయిన్ క్రికెట్ సెంటర్, కెహెచ్కె ఎంఎంఎ బహ్రెయిన్ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ని నిర్వహించాయి. ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ది సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్, హానరరీ ప్రెసిడెంట్ బహ్రెయిన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ డిజేబులిటీస్ షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆరు టీమ్‌లు, నలుగురు చొప్పున అంతర్జాతీయ ఆటగాళ్ళు, 12 మంది ఆటగాళ్ళు జీసీసీ దేశాలకు చెందినవారు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. గత బుధవారం ఈ టోర్నమెంట్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









