వినూత్న ప్రయోగంతో వస్తున్న మంచు విష్ణు
- October 02, 2017
చెన్నై: నిన్నటి వరకు అనువాద చిత్రాలతోనే తెలుగు హీరోలు తమిళ మార్కెట్‌లోకి వచ్చేవారు. ఇప్పుడు ఏకంగా ద్విభాషా చిత్రంలో తమిళంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ఆ జాబితాలో నటుడు విష్ణు కూడా చేరారు. కురల్ 388 చిత్రం ద్వారా ఆయన తమిళ తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఓటర్‌గా తెరకెక్కుతోంది. సంపత్‌రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, మునీస్‌కాంత్, బ్రహ్మానందంలు ఇతర తారాగణం. రామారీల్స్ బ్యానరుపై జాన్ సుదీర్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజేష్ యాదవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జీఎస్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ తిరుక్కురల్‌లో ఏడు పదాలతో ప్రపంచంలోని నీతులన్నింటినీ తెలియజేశారు. అందులోని 388వ నీతి ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత కాలానికి తగ్గట్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా తమిళ సినీరంగ ప్రవేశానికి ఈ సినిమా పూర్తిస్థాయిలో నప్పుతుందని నమ్ముతున్నా. ఇందులో ప్రేమ, యాక్షన్, హాస్యం అన్నీ కలగలసి ఉంటాయి.
విజయ దశమి రోజున సినీరంగ ప్రవేశం చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







