దుబాయ్: ప్రాణాలు తెగించి కాపాడిన యువతికి 'అభయ ఉమన్' అవార్డు
- October 02, 2017
దుబాయ్: రెండు ట్రక్కులు ఢీకొట్టి ఎగసిపడిన మంటల నుంచి ట్రక్కు డ్రైవర్‌ను ఓ యువతి ప్రాణాలకు తెగించి కాపాడింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాహ్ నగరంలో సోమవారం జరిగిందీ ఘటన. భారత్‌కు చెందిన హర్కిరిత్ సింగ్ రోజూలాగే ట్రక్కులో వెళ్తుండగా మరో ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న హర్కిరిత్ ఆర్తనాదాలు చేశాడు. స్నేహితురాలితో అటుగా కారులో వచ్చిన జవహర్ సైఫ్ అల్ కుమైతీ(22) వెంటనే స్పందించింది. స్నేహితురాలి వస్త్రాలను విప్పమని చెప్పి తనను కారులో ఉండాలని కోరింది. ఆ బట్టలతో మంటలను ఆర్పి అతడిని కాపాడింది. కాగా, జవహర్ ధైర్య సాహసాలను భారత రాయబారి నవదీప్‌సింగ్ సూరి కొనియాడారు. మరోవైపు ఆ యువతిని 'అభయ ఉమన్' అవార్డుతో సత్కరించనున్నట్లు దుబాయ్ అంబులెన్స్ అండ్ రెస్క్యూ సెక్షన్ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







