`న‌య‌నం` టైటిల్ లోగో లాంచ్‌!

- October 03, 2017 , by Maagulf
`న‌య‌నం` టైటిల్ లోగో లాంచ్‌!

లావోస్ మోషన్ పిక్చర్స్  ప‌తాకంపై  రూపొందుతున్న  మొదటి చిత్రం `న‌య‌నం`. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో  న‌టిస్తున్నారు.   ప్రముఖ దర్శకుడు రాజమౌళి  వ‌ద్ద  ఈగ, మర్యాద రామన్న , మగధీర  చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్  ఇటీవ‌ల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో లాంచ్ హైద‌రాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో  `పెళ్లి చూపులు` చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``న‌య‌నం` టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్టు కూడా కొంచెం విన్నాను ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గారి శిష్యుడి డైర‌క్ష‌న్ లో సినిమా వ‌స్తుందంటే ఎలా ఉండ‌బోతుందో మ‌నం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com