లాస్‌ వెగాస్‌ ఘటనను ఖండించిన బహ్రెయిన్‌

- October 03, 2017 , by Maagulf
లాస్‌ వెగాస్‌ ఘటనను ఖండించిన బహ్రెయిన్‌

మనామా: లాస్‌ వెగాస్‌లో జరిగిన గన్‌ ఫైర్‌, ఆ కారణంగా 29 మంది చెందడం పట్ల బహ్రెయిన్‌, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహ్రెయిన్‌ పేర్కొంది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్‌ ఆకాంక్షించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ తరఫున విడుదలైన ఓ ప్రకటనలో, బహ్రెయిన్‌ ఈ తరహా దాడుల్ని ఎప్పుడూ సమర్థించదని పేర్కొంది. ఈ తరహా చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పేర్కొంది. అమాయకుల ప్రాణాల్ని బలిగొన్నవారికి మతం, ప్రాంతంతో సంబంధం లేదని బహ్రెయిన్‌ పేర్కొంది. తీవ్రవాదం వంటి అంశాల్లో ప్రపంచ దేశాలతోపాటు కలిసి పోరాడేందుకు బహ్రెయిన్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com