తగ్గిన పసిడి ధర..!
- October 03, 2017
బంగారం ధర పతనమైంది. మంగళవారం రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,550కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రూ.600 ధర తగ్గి కేజీ వెండి రూ.40,200కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఆశించిన మేర లేకపోవడంతో ధర తగ్గినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.14శాతం తగ్గడంతో ఔన్సు 1,268.70 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









