ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో ప్రవాసీయులకు ఫీజు పెంపుదల లేదు

- October 04, 2017 , by Maagulf
ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో ప్రవాసీయులకు ఫీజు పెంపుదల లేదు

కువైట్: దేశంలో ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో విదేశీయులకు ఆరోగ్య ఫీజుని వసూలు చేయాలనే నిర్ణయం నుంచి  మినహాయించారు. పంటి సంబంధిత వ్యాధలతో వచ్చే ప్రవాసీయుల నుంచి ఏ విధమైన నూతన ఫీజులను రాబట్టరాదని  ఆరోగ్య మంత్రిత్వశాఖలోని దంత సంబంధిత  వ్యవహారాల కోసం సహాయ కార్యదర్శి డాక్టర్ యూసుఫ్అల్-డోవరిర్ ప్రత్యేక దంత కేంద్రాల అధిపతులను ఆదేశించారు. ఆరోగ్య భీమా కింద వారు కేంద్రాన్ని సందర్శించే ప్రతిసారీ  2 కువైట్ దినార్లను (పాత రుసుము) మాత్రమే  నమోదు చేసుకుంటారు. ఈ అక్టోబర్  నెల 1 వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అందించబడిన వివిధ సేవల కొరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రుసుమును పెంచిన విషయం " మా గల్ఫ్ పాఠకులకు విదితమే ".

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com