పెరిగిన వైద్య ఫీజులతో 30 శాతం ప్రవాసీయులు పబ్లిక్ క్లినిక్ లను సందర్శించడం లేదు

- October 04, 2017 , by Maagulf
పెరిగిన వైద్య ఫీజులతో 30 శాతం ప్రవాసీయులు పబ్లిక్ క్లినిక్ లను సందర్శించడం లేదు

కువైట్: ' మోకాలి మీద కొడితే....మూతి పళ్ళు రాలేయని ' మన తెలుగు సామెత. అచ్చంగా అలానే తయారైంది కువైట్లో ప్రవాసీయుల పరిస్థితి. అనారోగ్యం పాలైన ప్రవాసీయులకు జబ్బు చేస్తే.. భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. ప్రజల వైద్య సదుపాయాలకు సంబంధించి అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రభుత్వం పబ్లిక్ మెడికల్ సేవలలో ప్రవేశపెట్టినందున ఫీజు పెంపు చర్యతో  ఆస్పత్రులలో వైద్యం కోసం వచ్చిన వారి సంఖ్య 30 శాతం వరకు తగ్గుముఖం పట్టినట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి తెలిపారు. అదేవిధంగా  అత్యవసర గదుల్లో ఉన్న రోగుల సంఖ్య  30 శాతం తగ్గాయి. ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్న వారిలో 30 శాతం మంది క్షీణించినవారు, కొత్త వైద్య ఫీజులు అమలుచేసినప్పటి నుంచి తగ్గారు. ప్రజా ఆరోగ్య ఆసుపత్రులను, వైద్య కేంద్రాన్ని సందర్శించే ప్రవాసియ రోగుల హాజరు గూర్చి వారం వారం గణాంకాలను సమర్పించాలని ఆరోగ్య జిల్లాలు డైరెక్టర్లను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com