చర్మ సోయగానికి...

- April 29, 2015 , by Maagulf
చర్మ సోయగానికి...

అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కాకపోతే పార్లర్లకి వెళ్ళే తీరిక, ఓపిక కొందరికి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం ఇంట్లోనే ఆచరించదగిన చిట్కాలు..

  • నిమ్మరసం: చాల తేలికైన చిట్కా ఇది. టేబుల్ స్పూను నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత ముఖం కడుక్కుంటే మిల మిల మెరుస్తూంటుంది. ఈ నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • టమాటోరసం: టమాటో రసాన్ని స్నానికి ముందు ముఖం అంతా పట్టించి బాగా ఆరనిచ్చి అనంతరం స్నానం చేస్తే మంచిది.
  • ఓట్ మీల్: ఓట్మీల్, బాదాంపప్పులను పొడిచేసి దానిలో పాలు,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు శరీరమంతా పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచిది.
  • పాలు: ముఖం మీద మురికిని తొలగించడానికి పాలు బాగా ఉపకరిస్తాయి.రాత్రి పడుకోవటానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజెర్ అప్లై చేసుకోవాలి. పాలు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించడంలో బాగా ఉపకరిస్తుంది. చర్మం లోపలిదాకా వెళ్లి మురికిని తొలగించడమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది.
  • శాండిల్ వుడ్: శాండిల్ వుడ్ పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com