భారత్‌దేశంలో తగ్గిన బంగారం ధర
- October 05, 2017
బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి తగిన డిమాండ్ లేకపోవడంతో దేశంలో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.225 తగ్గి రూ.30,375గా పలుకుతోంది. మరో పక్క అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు బాగానే పెరిగాయి. భారత్‌లో వెండి సైతం కేజీకి రూ.450 తగ్గి రూ.40 వేలకు పడిపోయింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు తగినంత లేకపోవడమే ఇందుకు కారణం.
స్థానిక వ్యాపారుల, రిటైలర్ల నుంచి పసిడికి డిమాండ్ లేదని దాంతో స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు పెరగలేదని, అయితే విదేశాల్లో బంగారం డిమాండ్ కొనసాగుతుండటం వల్ల స్థిరంగా ధరలు ఉన్నాయని ట్రేడర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు ఔన్సుకు 1275.40 డాలర్లుగా ఉండగా, వెండి సింగపూర్లో 0.24% తగ్గి ఔన్సుకు 16.61 డాలర్లుగా పలుకుతోంది.
దేశ రాజధాని డిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.225 తగ్గి వరుసగా రూ.30,375గాను, రూ.30,225గాను ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు రూ.50 పెరిగాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







