4 నిమిషాల్లో 1000 మందిని ఖాళీ చేయించారు
- October 05, 2017
దుబాయ్ మునిసిపాలిటీ, నైఫ్ మార్కెట్లో 1000 మంది ప్రజల్ని కేవలం నాలుగు నిమిషాల్లోపే ఖాళీ చేయించడం జరిగింది. అయితే ఇదంతా ఓ 'డ్రిల్'లో భాగమే కావడం గమనించదగ్గ అంశం. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఈ డ్రిల్ని నిర్వహించినట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్, కార్పొరేట్ ఎమర్జన్సీ అండ్ క్రైసిస్ టీమ్ హెడ్ మాట్లాడుతూ, అత్యంత పకడ్బందీగా ఈ డ్రిల్ చేపట్టామని అన్నారు. షాప్ల నిర్వాహకులు కూడా తమకు పూర్తిగా సహకరించారనీ, అనుకోని సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలు జాగ్రత్తగా బయటపడటమెలాగో తెలియజేశామని ఆయన చెప్పారు. 265 షాప్లు కలిగి ఉన్న నైఫ్ మార్కెట్ని నిత్యం వేలాదిమంది సందర్శిస్తుంటారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









